hi-https://www.andhrapravasi.com/wp_dashboard/post_images/pm kisan 19 instalment.202502231979.jpg

Header Banner

సోమవారమే ఖాతాల్లోకి రూ.2 వేలు! కానీ ఆ రైతులకు బంద్! ఎందుకో తెలుసా?

  Sun Feb 23, 2025 18:59        India

రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వ్యవసాయం చేసే రైతులకు ఏడాదికి రూ. 6 వేలు పెట్టుబడి సాయం అందిస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఒక్కసారి కాకుండా ఏడాదిలో మూడు విడుతలుగా రూ.2000 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఖాతాల్లో జమ చేస్తున్నారు. 18 విడతల డబ్బులు విడుదల చేయగా.. 19వ విడత విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ఫిబ్రవరి 24, 2025 రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ సాయం విడుదల చేస్తారని కేంద్రం వ్యవసాయ శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు అర్హులైన రైతులకు సందేశాలు పంపించింది. అయితే అనర్హులైన రైతులను ఈ పథకం నుంచి తొలగిస్తున్నారు. ప్రత్యేక కేటగిరీలో ఉన్న రైతులకు పీఎం కిసాన్ సాయం కట్ చేస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. 

 

పీఎం కిసాన్ స్కీమ్ 18 విడత కింద 9.4 కోట్ల రైతుల అకౌంట్లలో అక్టోబర్ 5, 2024న రూ.2 వేలు జమ చేశారు. 19వ విడత కింద ఫిబ్రవరి 24వ తేదీన సోమవారం నిధులు విడుదల చేయనున్నారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో పీఎం కిసాన్ పథకం అర్హుల జాబితాలో తాము ఉన్నామో లేమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనర్హులైన రైతుల పేర్లను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. పొరపాటున మీ పేరు తొలగిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. లేదంటే రూ.2 వేలు కోల్పోవాల్సి వస్తుంది. 

 

ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

పీఎం కిసాన్ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొన్ని కేటగిరీల్లో ఉన్న రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వరు. అందుకు సంబంధించిన నిబంధనలు మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ గతంలోనే వెల్లడించింది. దీని ప్రకారం ఇన్‌స్టిట్యూషనల్ ల్యాండ్ ఓనర్లు, కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉంటే పీఎం కిసాన్ సాయానికి అనర్హులు. అలాగే సర్వీసులో ఉన్న, రిటైర్డైన వారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ కంపెనీల్లోని ఉద్యోగులు, ప్రభుత్వ ఆటోనమస్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సైతం సాయం రాదు. అలాగే డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్ల వంటి వృత్తి నిపుణులకు ఈ సాయం ఇవ్వరు. అలాగే నెలకు రూ.10 వేలపైన పెన్షన్ అందునే వారూ అనర్హులే. ఇక ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వారు సైతం అనర్హులేనని కేంద్రం చెబుతోంది. పైన పేర్కొన్న వారి పేరుపై వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ పెట్టుబడి సాయం ఇవ్వరు. అయితే ఈ కేటగిరీల్లోని పలువురికి గతంలో సాయం అందినట్లు సమాచారం. వారందరి పేర్లను ఎప్పటికప్పుడు తొలిస్తున్నారు. అనర్హులు సాయం పొందితే తిరిగి రికవరీ చేస్తామని సైతం హెచ్చరిస్తున్నారు. 

 

పీఎం కిసాన్ స్టేటస్ ప్రక్రియ
- అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ Portal కి వెళ్లాలి
- హోమ్ పేజీలోని ఫార్మర్స్ కార్నర్‌‌లో డ్యాష్ బోర్డ్ ఆప్షన్ ఎంచుకోవాలి
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలు ఎంటర్ చేయాలి
- మీ రాష్ట్రం, జిల్లా, తహసీల్, గ్రామ పంచాయతీ వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయాలి.
- ఆ తర్వాత స్క్రీన్‌పై అర్హులైన రైతుల వివరాలు కనిపిస్తాయి.
- అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP